|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 03:26 PM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వడ్డె ఓబన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు ప్రారంభించారు.ర్యాలీలో పాల్గొని ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వడ్డెర కుల సోదరులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ.వడ్డె ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా వుందని ఓబన్న ఆశయాలు సాధించాలన్నారు.ఆలేరు నియోజకవర్గంలో నా గెలుపుకు వడ్డెర సోదరులు ఉయ్యాల వారి నర్సింహా రెడ్డి గారి కి ఎలా తోడుగా ఉన్నారో వడ్డెర సోదరులు కూడా అలా నాకు కృషి చేశారని అన్నారు.తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న అన్నారు..రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి జీవితాంతం తోడుగా ఉండి అనేక పోరాటాలు చేశాడు వడ్డే ఓబన్న.చేశాడని అన్నారు.. బడుగు బలహీన వర్గాల నుండి ఎదిగిన పోరాటయోధుడు కొనియాడారు..అలాంటి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వడ్డే ఓబన్న జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. వడ్డెర జాతికే కాకుండా యావత్ తెలుగు ప్రజలకు వడ్డె ఓబన్న జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.