|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 03:21 PM
హైదరాబాద్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే భార్య పాలిట కాల యముడై, ఆమెను కొట్టి చంపాడు. అనంతరం గుండెపోటుతో మరణించిందని సమాచారం ఇచ్చాడు.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన అనిల్‌కు సాహితి అనే యువతితో వివాహం జరిగింది. అయితే, అనిల్ సాహితి సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అనిల్ సాహితిని కొట్టి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాహితి మరణం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.