|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 03:17 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో వాణి నగర్ నుండి పెద్ద చెరువు, బంధం కొమ్ము మీదుగా 23 కోట్ల రూపాయలతో చేపడుతున్న రహదారి విస్తరణ పనులను పరిశీలించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. బంధం కొమ్మ నుండి పెద్ద చెరువు వరకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న స్తంభాల తొలగింపు.. నూతన లైన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే నాలుగు కోట్ల 70 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వాణి నగర్ నుండి పెద్ద చెరువు వరకు రహదారి విస్తరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అతి త్వరలో మిగిలిన పనులను సైతం పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. హాజరైన మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఎమ్మార్వో వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, విద్యుత్ శాఖ డీఈ భాస్కర్ రావు, మున్సిపల్ ఇంజనీరింగ్ డీఈ వెంకటరమణ, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.