|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 04:08 PM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించే వరకు రాష్ట్ర జేఏసీ కార్యాచరణ మేరకు ఈనెల 15 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు చెప్పారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సులో ఆయన మాట్లాడుతూ. ఐకాసకు ఉద్యోగులంతా అండగా ఉంటారన్నారు.