|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 04:10 PM
కల్వకుర్గి నియోజకవర్గంలోని ఎలికట్ట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారం అందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విరాళంగా సిమెంటు బస్తాలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఆలయ నిర్మాణానికి సహాయం చేయాలంటూ కమిటీ సభ్యులు చేసిన వినతికి స్పందించిన వెంకటేష్, నిర్మాణానికి అవసరమైన సిమెంటును సమకూర్చేందుకు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భీమయ్య, కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఈ విరాళం ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, స్థానిక భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.