|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 04:14 PM
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని మంత్రి తుమ్మల చెప్పారు. సోమవారం సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత పథకాలు అర్హులకు అందాలని కానీ రాష్ట్రంలో ఒక కోటి కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు మాత్రం ఒక కోటి 25 లక్షల ఉన్నాయి అని చెప్పారు. రూపాయికే కిలో బియ్యం ఇచ్చిన ఎన్టిఆర్ దేవుడు అని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఉచిత పథకాలపై తుమ్మల తన అభిప్రాయాన్ని ఓ బలమైన ఉదాహరణతో వివరించారు. ‘‘తినడానికి తిండిలేని వ్యక్తికి బియ్యం ఇవ్వాలి. కానీ, రేషన్ తీసుకొని బజార్లో అమ్మేసే వారికి ఎందుకు ఇవ్వాలి? ఇది అర్ధవంతమైన విధానం కాదు. ప్రభుత్వ నిధులు వ్యర్థంగా పోవకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ,’’ అని తుమ్మల స్పష్టం చేశారు.