|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 04:16 PM
మహబూబ్‌నగర్ జిల్లా, అడ్డాకుల మండలం మాజీ జడ్పీటీసీ విద్యావతమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జియంఆర్) మాజీ జడ్పీటీసీ భౌతికదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యావతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.