|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 04:18 PM
ప్రజావాణికి వచ్చిన వినతులను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐడీఓసి సమావేశ మందిరంలో ఫిర్యాదుదారుల నుండి వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల దరఖాస్తులపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.