|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 12:13 PM
అమరచింత మండల కేంద్రంలో ఈ నెల 11న జరగనున్న టీయుసిఐ (ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) ప్రథమ జిల్లా మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మాస్ లైన్ కార్యాలయ ఆవరణలో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారి పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. మహాసభలను జయప్రదం చేయడానికి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.