|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 12:36 PM
మణుగూరు ఇసుక సొసైటీ ర్యాంపులో వసూళ్ల పర్వం కొనసాగుతోందని ఆదివారం లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అనంతారం, పద్మగూడెం ఇసుక ర్యాంపుల్లో రేసింగ్ కాంట్రాక్టర్లు రూ. 500 నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. గత నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.