|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 08:03 PM
సమాజ సేవకు, ధార్మికతకు ప్రతీక, మంచి పాలనకు అహల్యాబాయి హోల్కర్ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బాలానగర్లో ఆదివారం నిర్వహించిన అహల్యాబాయి హోల్కర్ జయంతి కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా బీజేపీ కన్వీనర్ ఎస్. మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్నారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ అహల్యాబాయి హోల్కర్ మంచి పాలనకు, సమాజ సేవకు, ధార్మికతకు ప్రతీక అని అన్నారు. నేటి యువత ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దేశానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు.