|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 08:11 PM
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం తీసుకువచ్చిన ఆపరేషన్ కగార్‌పై HYDలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బస్తర్ ఇంచార్జ్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ల అంశాలపై కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.