|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 10:15 AM
గర్భిణీ ప్రాణాలు తీసిన మూఢనమ్మకం. ఇంటి నిర్మాణ సమయంలో భార్య గర్భంతో ఉండడం అపశకునమని అబార్షన్ మాత్రలు మింగిచిన భర్త . అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారుగూడకు చెందిన ప్రవళికకు మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరగగా, ఇటీవల నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టిన దంపతులు. అయితే ఇంటి నిర్మాణ సమయంలో ప్రవళిక గర్భం దాల్చడం అరిష్టమని భావించి అబార్షన్ మాత్రలు మింగించిన ప్రశాంత్ . దీంతో తీవ్ర రక్తస్రావం అవ్వడంతో చికిత్స నిమిత్తం ప్రవళికను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు. పరిస్తితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించిన ప్రవళిక. ప్రవళిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు