|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 10:12 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయి 81,214 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 82 పాయింట్ల నష్టంతో 24,669 వద్ద కొనసాగుతోంది. ఎటర్నల్, SBI షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, HCL షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ముడి చమురు ధరలు, ఇతర ఆర్థిక అంశాల వల్ల సూచీలకు ఒత్తిడి రావచ్చని నిపుణులు పేర్కొన్నారు.