|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 12:30 PM
ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేయడంలో మిలియన్ మార్చ్ ప్రధాన భూమిక పోషించింది. నాడు హైదరాబాద్ అంతా హై సెక్యూరిటీ. అడుగడుగునా అడ్డంకులు, అరెస్టులు. సిటీలో పరిస్థితి కంట్రోల్ తప్పింది. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కా ప్లాన్తో ఖాకీల కట్టడిని చిత్తు చేస్తూ ట్యాంక్ బండ్పైకి చేరింది. మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చింది.