|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:32 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన హరీశ్‌రావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అందాల పోటీలపై హరీశ్‌రావు మండిపడ్డారు. "అందాల పోటీల కోసం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లండ్, ఒకరు తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం చూశాం. కేవలం విందులు, వినోదాల కోసమే ఈ పోటీలు నిర్వహించారు తప్ప, దీనివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు రావడం మినహా మరే ప్రయోజనం లేదు" అని ఆయన అన్నారు. మూసీ ప్రక్షాళన, 'హైడ్రా' వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసిందని దుయ్యబట్టారు.