|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 08:10 PM
ప్రపంచ భాగస్వామ్యాలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణ పురోభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామని CM రేవంత్ అన్నారు. HYDలో జపాన్‌లోని కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టెక్యూచి, ప్రతినిధి బృందంతో సీఎం సమావేశమై చర్చించారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి రంగాల్లో కిటాక్యుషు సహాకారం కోసం అవగాహన ఒప్పందంపై ఇరు వర్గాలు సంతకాలు చేశాయి. కాగా, గత ఏప్రిల్‌లో సీఎం బృందం జపాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.