|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 08:12 PM
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై సోమవారం నారాయణపేట కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎత్తిపోతల పథకంపై రెవెన్యూ అధికారులు గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలు, భూ సేకరణ సర్వేలపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని నిర్వాసితుల పునరావాస, ఉపాధి కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కు ప్రతిపాదనలు పంపుతామని అన్నారు.