|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 01:00 PM
గచ్చిబౌలి లో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుగా ఈ ఘటన జరిగింది.కారు రన్నింగ్‌లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ( మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో గచ్చిబౌలి వేళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారు ఇంజన్ నుంచి మంటలు రావడం గమనించిన ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగిపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి వచ్చేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.