|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 12:50 PM
రైతులు వరికి బదులు పామాయిల్ సాగు చేసే విధంగా అధికారులు ప్రోత్సహిస్తూ ఉండాలని, దీనివల్ల రైతులు తాలు, తరుగు పేరుతో ఎలాంటి ఇబ్బందులు పడరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆయిల్ ఫామ్ పంట హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పామాయిల్ సాగు ఇతర నూనె పంటల కంటే మూడు రెట్లు అధిక దిగుబడి వస్తుందన్నారు.