|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:53 PM
జగిత్యాల పట్టణంలోని 2వ, 17వ, 18వ వార్డులలో రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమం ‘రైసింగ్ తెలంగాణ 2047’లో భాగంగా నిర్వహించిన 100 రోజుల పట్టణ ప్రణాళిక అవగాహన ర్యాలీ సందర్భంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బద్దం లతా జగన్, చుక్క నవీన్, మున్సిపల్ ఇంజనీర్ ఏఈ అనిల్, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి వాడకూ అభివృద్ధిని చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.