|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:45 PM
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వివాహమైన 14 రోజులకే గుండెపోటుతో సాయికిరణ్ అనే నవ వరుడు మరణించాడు. అయితే సాయికిరణ్‌కు మే21న అంసానిపల్లికి చెందిన యువతితో వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు వృత్తిరీత్యా బ్యాండ్ వాయిస్తాడని, సోమవారం బ్యాండ్ కొట్టేందుకు వెళ్లి గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.