|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 03:44 PM
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "అధికారంలో ఉన్నప్పుడే అవిర్భావ దినోత్సవం గుర్తుంటుందా? అధికారం లేకపోతే బీఆర్ఎస్ నేతలు వేడుకల్లో పాల్గొనరా? జూన్ 2న కేసీఆర్ బయటికి రాలేదు. కనీసం అమరవీరులకు నివాళులర్పించలేదు. కేటీఆర్ అమెరికాకు వెళ్లారు. ఆయన కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనలేదు." అని అన్నారు.