|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 07:07 PM
దామరగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా నాణ్యమైన విద్య అందుతుందని సీనియర్ లెక్చరర్ అనంతరెడ్డి తెలిపారు. మంగళవారం దామరగిద్ద మండలంలోని గడి మున్కన్ పల్లి, లింగారెడ్డి పల్లి, ఉడ్మలగిద్ద గ్రామాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను కలిసి, తమ పిల్లలను దామరగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకారవేతనం, మరియు ఇతర సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యమైన విద్యతో పాటు ఆర్థిక సహాయం కూడా పొందవచ్చని సూచించారు.