|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 08:16 PM
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతార నర్సాపూర్ మండలంలోని గ్రామాల్లో నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని.. విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.