|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 12:50 PM
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేసింది. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆధార్ ఆధారంగా ఇంటింటికీ చీరలు అందజేస్తారు. మహిళా సంఘాల సభ్యులు బొట్టు పెట్టి గౌరవంగా పంపిణీ చేస్తారు. సాంకేతికత కోసం మొబైల్ యాప్‌లో మహిళ ఫోటో, ఆధార్ నమోదు తప్పనిసరి. మహిళా సంఘాలలో సభ్యులు కానివారు చీర తీసుకోవాలనుకుంటే, వారికి తక్షణమే సభ్యత్వాన్ని నమోదు చేసిన తర్వాతే పంపిణీ జరుగుతుంది.