|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 01:43 PM
TG: రేవంత్ సర్కార్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శుల్లో అర్హులైన 9 మందికి సూపరింటెండెంట్ పదవులు, అలాగే 130 సీనియర్ అసిస్టెంట్లకు కూడా ఒకేసారి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడేళ్ల తర్వాత వచ్చిన ఈ పదోన్నతులతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.