|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 03:03 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి డివిజన్లు, నిజాంపేట్ కార్పొరేషన్, కొంపల్లి - దుండిగల్ మున్సిపాలిటీలకు చెందిన సుమారు 35 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి కింద సుమారు 11.50 లక్షల రూపాయల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధ్యక్షులు, నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు.