|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 03:00 PM
వరంగల్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు బండి సుజాత భర్త బండి నగేష్ కాలుకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన నేపథ్యంలో, వి ఏ కే ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వన్నాల వెంకట రమణ గురువారం ₹12,000 ఆర్థిక సహాయం అందించారు. గత 16 ఏళ్లుగా వి ఏ కే సమైక్య ఫౌండేషన్ పేద కుటుంబాలకు ఉచిత బియ్యం, కంటి శిబిరాలు, విద్యా సహాయం, వైద్య సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సముద్రాల పరమేశ్వర్, కనుకుంట్ల రంజిత్ కుమార్, అపురూప రజనిష్ నేత, కొంతం సందీప్, తమ్మిశెట్టి క్రాంతి పాల్గొన్నారు.