|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 03:47 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి మాట్లాడాలని, కోనసీమ పాడవడానికి తెలంగాణ నాయకులే కారణమన్న ఆయన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ దిష్టి పెట్టలేదని, కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలని కోరుకున్నామని తెలిపారు. తెలంగాణ బిడ్డల మనసు గొప్పదని, తాము ఎప్పుడూ జై తెలంగాణ, జై ఆంధ్రా అని అనలేదని, ఆంధ్ర కూడా బాగుండాలని కోరుకున్నామని పేర్కొన్నారు.