బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 08:46 PM
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో శనివారం జరిగిన వివాహ వేడుకలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో, వరసకు బావ అయిన మొలుగూరి కొమురయ్య (58)ను బుర్ర రాజకొమురయ్య కత్తితో పొడిచి హత్య చేశాడు. వివాహానికి హాజరైన కొమురయ్య, తన బావ సత్తయను చంపడానికి ప్రయత్నిస్తున్న రాజకొమురయ్యను అడ్డుకోవడంతో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు రాజకొమురయ్య పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని డిస్పెన్సరీలో ఉంచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.