|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:19 PM
పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలల ప్రభావం సెలబ్రిటీలపై కూడా పడింది. హాలిడే ట్రిప్ కోసం దుబాయ్ వెళ్లిన నటి సోనాల్ చౌహాన్.. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయారు. విమానాశ్రయాలు మూతపడటంతో ఆమె స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం లేక ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యవసర విజ్ఞప్తి చేశారు. ‘‘గౌరవనీయ ప్రధాని మోదీ జీ.. ప్రస్తుత యుద్ధ సంక్షోభం కారణంగా నేను దుబాయ్‌లో చిక్కుకున్నాను. విమానాలు రద్దయ్యాయి, ఇంటికి రావడానికి వేరే దారి లేదు. దయచేసి నేను సురక్షితంగా భారత్ చేరుకోవడానికి సహకరించండి’’ అని ఆమె తన పోస్టులో కోరారు.
Latest News