|
|
by Suryaa Desk | Sat, Nov 11, 2023, 01:50 PM
సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ చిరంజీవి , స్పందిస్తూ... నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.
Latest News