|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 11:25 AM
కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీ కి చెందిన పుట్టబంతి శివ శంకర్ లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. కాగా మంగళవారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శంకర్ ఇటీవల ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుని తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.