|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 11:20 AM
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగా తెలంగాణలో ప్రాంతం సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో బుధవారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు- రేపల్లె (07784/07785), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873/07874), రేపల్లె-తెనాలి (07875/07876), రేపల్లె-తెనాలి (07787/07888), గుంటూరు-రేపల్లె (07887), చెన్నైసెంట్రల్-న్యూజల్పాయిగురి (22611) వెళ్లే రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. సికింద్రాబాద్-గూడూరు (12710), తిరుపతి-లింగంపల్లి (12733), సికింద్రాబాద్-తిరుపతి (12764), కాకినాడటౌన్-బెంగళూరు (12710) రేపటి నుంచి నడవనున్నాయి.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నయాని తెలిపిన వాతావారణ శాఖ, ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.