|
|
by Suryaa Desk | Sat, Jun 22, 2024, 10:31 AM
అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన జి. రామయ్యకు చికిత్స నిమిత్తం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద వారి కుటుంబ సభ్యునికి రూ. 1, 10, 000/- విలువగల ఎల్. ఓ. సి ని అందజేశారు. ఆరోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.