|
|
by Suryaa Desk | Sat, Jun 22, 2024, 01:29 PM
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం శివారులో ఉన్న పెద్ద చెరువులో శనివారం వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. మృతదేహాన్ని జాలర్లు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు 41 సం. పాశ్వాన్ అనే వ్యక్తి గా గుర్తించారు. అతని వద్ద ఐడి కార్డు జేబులో దొరికింది. పోలీసులు అతడిని రైల్వే ఉద్యోగిగా గుర్తించారు. చెరువులో దిగి చనిపోయారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.