by Suryaa Desk | Sat, Jul 13, 2024, 10:48 AM
జన్నారం ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్టును నియమించాలని ప్రజలు కోరారు. జన్నారం మండలం నాలుగైదు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉంది. దీంతో జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి జన్నారం మండలంతో పాటు పరిసర మండలాల నుండి గర్భిణీ మహిళలు ప్రసవం కోసం వస్తుంటారు. అయితే గైనకాలజిస్ట్ లేకపోవడంతో చాలావరకు ప్రసవాలను జగిత్యాల, మంచిర్యాలకు రిఫర్ చేస్తున్నారు. జన్నారం ఆస్పత్రిలో గైనకాలజిస్టును నియమించాలని వారు కోరారు.