by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:53 PM
వికలాంగులకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారని వికలాంగుల సంక్షేమ సంఘం మండల ప్రతినిధి ఇటిక్యాల నితిన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆయన అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి వికలాంగులు ఎంతో రుణపడి ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు పలు పథకాలను అమలు చేయాలన్నారు.