![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 07:36 PM
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లి నిజాంపేట్ వద్ద స్కూటీని ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీద ఉన్న వ్యక్తి తలపైకి లారీ ఎక్కడంతో.. సదరు వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.