![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 07:47 PM
మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో ఎంపీ డికె అరుణ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 5 లక్షల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న ఆర్ఓ వాటర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ స్థానిక ప్రజల తాగు నీటి ఇబ్బందులు తీర్చడమే లక్ష్యంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, హైమాక్స్ లైట్స్ కావాలని అడిగారు అవి కూడా ఇప్పిస్తానని అన్నారు.