![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:10 AM
యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి న్యాయం చేయాలని తెలంగాణ హైకోర్టును అభ్యర్థించాడు.హర్షసాయి దాఖలు చేసిన పిటిషన్ రేపు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అతడిపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో వేర్వేరుగా బెట్టింగ్ యాప్ కేసులు నమోదయ్యాయి. హర్షసాయి సహా పలువురు యూట్యూబర్లపై ఈ కేసులు నమోదైన విషయం తెలిసిందే.