![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:04 AM
మహబూబ్ నగర్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బుధవారం మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి కుమారస్వామిని ఢిల్లీలో కోరారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ కుమార్ రెడ్డి, దామోదర్ రావుతో కలిసి కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. మహబూబ్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.