![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 02:29 PM
TG: నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కూడన్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పొలం పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.