![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 02:59 PM
కంచ గచ్చిబౌలి భూముల వేలంపై MLC విజయశాంతి 'X' వేదికగా స్పందించారు. HCU పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన IMG సంస్థకు 2004లో చంద్రబాబు కేటాయించారని తెలిపారు. ఆ భూములను ఇతరులకు కేటాయించడం టీ బీజేపీ దృష్టిలో న్యాయం, సహేతుకం అని ఎద్దేవా చేశారు. ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ మంత్రులు కొట్లాడి, ఈ భూములను అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరమంటూ నానా యాగీ చేస్తున్నారని ట్వీట్ చేశారు.