![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 04:52 PM
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో గల గనుల శిక్షణా కేంద్రంలో శుక్రవారం షీ టీం ఎస్ఐ హైమ శిక్షణ కార్మికులకు, ఉద్యోగులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా షీ టీం ఎస్ఐ మాట్లాడుతూ ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం కర్తవ్యం అని, ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలపాలని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే సైబర్ నేరాల గురించి తెలిపారు.