![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 02:57 PM
TG: కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల కింద భూసేకరణ కోసం, చిన్న కాలువల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తు నిర్వీర్యం చేయాలనే కసితో ఉంది అన్నారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మిడ్ మానేరులో నీళ్ళు ఉన్నాయంటే కేసీఆర్ పుణ్యం అన్నారు. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.