![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 04:00 PM
నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆలయాల్లో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగిన సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
రాములోరి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు మంత్ర ముగ్ధులు అయ్యారు. ఆలయాలకు భారీగా హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి.