![]() |
![]() |
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:56 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో ఉన్న సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా, ఆయన సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందిన ఒక వ్యక్తి ఇంటికి విచ్చేశారు. సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. వారి జీవన పరిస్థితులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ అనుభవంపై సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం కళ్లల్లో ఆనందం స్వయంగా రుచిచూశానని భావోద్వేగభరితంగా వివరించారు. సారపాకలోస్వయంగా లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించానని వెల్లడించారు. అంతకు ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.