|
|
by Suryaa Desk | Sun, Apr 06, 2025, 06:54 PM
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి నూతన రేషన్ కార్డులు అందించాలని పిఓడబ్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం.
నారాయణపేట భగత్ సింగ్ భవన్ లో నిర్వహించిన పిఓడబ్ల్యు కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, గత పదేళ్లుగా కార్డులు లేని వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.